నందమూరి బాలకృష్ణతో యన్టీఆర్ సిరీస్ తెరకెక్కించి .. రెండు సినిమాలతోనూ దారుణమైన ఫలితాల్ని అందుకున్నాడు దర్శకుడు క్రిష్. ఆ రెండూ నందమూరి అభిమానుల్నే కాకుండా.. తనని కూడా బాగా నిరాశపరచడంతో .. కొంత కాలం బ్రేక్ తీసుకున్నాడు క్రిష్. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన పీరియాడికల్ కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ డేట్స్ సంపాదించి .. అతడితో ఈరోజే సినిమాను లాంచ్ చేశాడు. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాదే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు క్రిష్.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత మరో మెగా హీరోతో క్రిష్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది మరెవరో కాదు వరుణ్ తేజ అని టాక్. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో ‘కంచె’ సినిమా వచ్చింది. రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత క్రిష్ చేయబోయేది వరుణ్ తేజతోనే అని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న వరుణ్, కమ్ బ్యాక్ మూవీస్ తో అభిమానుల్ని ఖుషీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ లతో వరుసగా సినిమాలు చేసి.. తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు క్రిష్. మరి ఆ ప్రయత్నంలో అతడు ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.