ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు .. వైవిధ్యమైన పాత్రలు పోషించాలని తెగ ఆరాట పడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు హీరోలకు మంచి విజయం కూడా దక్కుతోంది. అయితే ఎంత వెరైటీ అయితే మాత్రం.. ఒకేసారి ఇద్దరు హీరోలు ఒకే పాత్రను పోషించడం కాస్తంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. మెగా మేనల్లుడు సాయిధర్మతేజ, మరో యంగ్ హీరో నితిన్ ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు.
కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ లో సాయిధర్మ తేజది ప్రేమ, గీమా లాంటి వ్యవహారాలు పెట్టుకొని సుఖంగా ఉన్న ప్రాణాన్ని దు:ఖంలోని నెట్టకూడదు అనుకొనే పెక్యులర్ పాత్ర అట. ఈ వేలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన సింగిల్ లో ఈ విషయాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు. కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి? అనుకొనే పాత్ర . అలాగే.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భీష్మ సినిమాలో నితిన్ పాత్ర కూడా ఇంచుమించు అలాంటిదే . ‘సింగిల్ ఫరెవర్’ ట్యాగ్ లైన్ తో జీవితంలో అసలు పెళ్ళిమాటే తలపెట్టకూడదనుకొనే పాత్రను పోషిస్తున్నాడట. సో మొత్తానికి సాయి, నితిన్ ఇద్దరూ అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకొనే పాత్రలన్నమాట. మరి ఈ రెండు సినిమాలతో వారిద్దరూ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.