పూర్వం సినిమాల్లో కూడా రీషూట్స్ వ్యవహారం ఉండేది. ఒక సీన్ సరిగ్గా రాకపోతే.. పెర్ఫెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ చిత్రీకరించేవారు. అలాంటి వారిలో ఏవీయం నిర్మాత చెట్టియార్ ఒకరు. ‘భక్తప్రహ్లాద’లో కొన్ని సీన్స్ , ‘మూగనోము’లో కొన్ని సీన్స్  రీషూట్‌ చేయించారు ఆయన. ‘మూగనోము’కి మూలచిత్రం, ఎవియమ్‌ వారే తీసిన ‘కళత్తూరు కన్నమ్మ’ తమిళ చిత్రం. దీనికి ముందుగా దర్శకుడు తాతినేని ప్రకాశరావు. కమల్‌హాసన్‌ బాలనటుడు. విచారంగా పాడతాడు. ఆ దృశ్యం చూసి, చెట్టియార్, ‘‘కమల్‌హాసన్‌ కళ్లలో నీరుంటే బాగుంటుంది. మల్లీ షూట్‌ చెయ్యండి’’ అన్నారు. ప్రకాశరావు ఒప్పుకోలేదు! ‘‘అతని కళ్లలో నీళ్లు అక్కర్లేదు’’ అని వాదించారు. మొత్తానికి ప్రకాశరావు ‘‘నేను చెయ్యను’’ అని మానేశారు. చెట్టియార్‌ భీమ్‌సింగ్‌ని దర్శకుడిగా పెట్టి చిత్రం పూర్తి చేయించారు. మొత్తానికి సినిమా హిట్‌ అయ్యింది. తమిళ సినిమాని, డబ్‌ చెయ్యకుండా, మధ్యమధ్యలో తెలుగు కామెంటరీ చెప్తూ తెలుగులో విడుదల చేశారు. దాన్నే మళ్లీ తెలుగులో ‘మూగనోము’ పేరుతో తీశారు. నాగేశ్వరరావు, జమున ముఖ్యనటులు. ఇందులో కూడా ఒక పాటని రిషూట్‌ చేయించారు చెట్టియార్‌.

Leave a comment

error: Content is protected !!