ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు, సినీ ప్రముఖులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ఆస్కార్ పురస్కార ప్రదానోత్సవం ఈ రోజు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలకు హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నిషియన్స్ పెద్ద ఎత్తున హాజరై.. పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఇతర ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరైన ఈ విశ్వ పురస్కార ప్రదానోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్నికోట్ల మంది టీవీల్లో వీక్షించారు. ఇక ఎప్పటిలాగానే ఈసారి కూడా మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కలేదు.
ఆస్కార్ 2020 విజేతలు :
ఉత్తమ చిత్రం : పారాసైట్
ఉత్తమ దర్శకుడు : బోంగ్ జాన్ హో (పారాసైట్)
ఉత్తమ హీరో : జాక్వెన్ పొనిక్స్ (జోకర్)
ఉత్తమ హీరోయిన్ : రెనీ జెల్వెగర్
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయ నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : రోజర్ డీకిన్స్ (1917)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : 1917
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ పిక్చర్ : 1917
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ : బాంబ్ షెల్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : టాప్ స్టోరీ 4
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : హెయిర్ లవ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : పారాసైట్ (బాంగ్ నాజ్ హో)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ : అమెరికన్ ఫ్యాక్టరీ