బాలీవుడ్ అందాల సుందరి కియారా అద్వానీ .. డేర్ నెస్ కు, బోల్డ్ నెస్ కు పెట్టింది పేరు. నిర్మొహమాటంగా అందాలు ఆరబోయడంలో ఈ బ్యూటీ అందరికన్నా ముందు వరుసలో ఉంటుంది.  అమ్మడు ఇప్పటివరకూ తన హాట్ ఫోటోస్ తో చాలా సార్లు నెటిజెన్స్ కు షాకిచ్చింది . ఇప్పుడు మరోసారి ఆవిడగారి బోల్డ్ నెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పాపులర్ ఫోటో గ్రాఫర్ దబు రత్తానీ కేలండర్ షూట్ ఈ సారి ఆమె అందాలకు వేదికగా మారింది.

దబు రత్తానీ 2020 కేలండర్ షూట్ లో బాలీవుడ్ నటీనటులు కియారా అద్వానీ , విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందులో కియారా అద్వానీ ఒక ఆకు చాటున టాప్ లెస్ గా ఇచ్చిన పోజు నెటిజెన్స్ ను నిద్రపట్టనీయకుండా చేస్తోంది. ఒక పెద్ద ఆకును చాటుగా చేసుకొని ఆమె శరీరంలోని మూడొంతుల భాగం రివీలవడం ఈ కేలండర్ హైలైట్స్  లో ఒకటి. మిగతా భామలు హాట్ గా పోజులిచ్చినా సరే..  కియారా అందాల ముందు అవి తేలిపోయాయి. కియారా తన హాట్ ఫోటో ను ఇటు ట్విట్టర్ లోనూ, అటు ఇన్ స్టా గ్రామ్ లోనూ పోస్ట్ చేయడంతో నెటిజెన్స్  కళ్ళన్నీ ఇప్పుడు అటువైపే ఉన్నాయి. మరి ఈ బోల్డ్ పోజుతో మరిన్ని పెద్ద  అవకాశాలు కైవసం చేసుకుంటుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!