Shopping Cart 0 items - $0.00 0

ఆకట్టుకుంటోన్న నానీ ‘వి’ లుక్

 

నేచురల్ స్టార్ నానీ, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లోఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వి’.  ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ను అప్పుడే దర్శక, నిర్మాతలు మొదలు పెట్టేశారు. ఇందులో నానీ మొదటిసారిగా నెగెటివ్ రోల్ ప్లే చేస్తోన్న సంగతి తెలిసిందే.  దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను  ఈ రోజు నానీ తన ట్విట్టర్ పేజ్ లో రిలీజ్ చేశాడు. రఫ్ గడ్డం , మెలితిరిగిన మీసకట్టుతో నానీ ఒక చేతిలో రక్తమోడుతోన్న కత్తెర తో రివీలయ్యాడు. దీన్ని బట్టి ఇందులో నానీ పాత్ర చాలా వయొలెంట్ గా ఉంటుందని ఎక్సెపెక్ట్ చేయొచ్చు.

నిన్ననే ‘వి’ చిత్రంలోని  హీరో సుధీర్ బాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అది కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంది. అదితీరావు హైదరి, నివేదా థామస్ కథానాయికలు గా నటిస్తోన్న  ఈ మూవీలో ఇంకా జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక  ‘వి’ సినిమా ఉగాది కానుకగా, అంటే.. మార్చ్ 25న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న  ఈ సినిమా నానీకి కెరీర్  ను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!