మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్..  టాలీవుడ్ లో ఓ వెరైటీ మూవీతో కమ్ బ్యాక్ అవుతున్నాడు. లాస్టియర్ మనోజ్  యమ్.యమ్. ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఆ బ్యానర్ లో తనే హీరో గా ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు ఈ రోజు  తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. సినిమా పేరు ‘అహం బ్రహ్మస్మి’ (నేనే బ్రహ్మను). ఈ మూవీ లోగో తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు.  మూడు అడ్డబొట్లు .. పైన ఒక నిలువు బొట్టుతో శివ తత్వాన్నితెలిపే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే ఈ సినిమా మార్చ్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.

కొత్త కుర్రోడు శ్రీకాంత్ యన్. రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మంచు మనోజ్ తల్లి నిర్మాలా దేవి సమర్పణలో మంచు మనోజ్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మార్చ్ లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎర్లియర్ గా ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో నటించిన మనోజ్ .. ఈ ఏడాది ‘అహం బ్రహ్మస్మి’ చిత్రంతో తన కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్దమవుతున్నాడు. మరి ఈ మూవీ మంచు మనోజ్ కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!