హెడ్డింగ్ ను చూసి.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? దానికీ, దీనికీ లింక్ ఉందండి. అయితే ఆ లింక్ సినిమాలో లేదు. అది డిలీటెడ్ సీన్స్ లోకి వెళ్లిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మలిచిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం ఈ సంక్రాంతి చిత్రాల్లో విజేత గా నిలవడమే కాకుండా..  బన్నీ కెరీర్ లోనే  నెం.1 హైయస్ట్ గ్రాస్ కలెక్టింగ్ మూవీ గా నిలచిపోయింది. ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ అవడానికి అందులోని ఫన్నీ సీన్స్, ఎమోషనల్ సీన్సే కారణం. అయితే ఈ సినిమా కోసం బోలెడు ఫన్నీ సీన్స్ రాసుకున్నాడు త్రివిక్రమ్. కానీ కొన్ని సీన్స్ లెంత్ కారణంగా డిలీట్ అయిపోయాయి. అలాంటి ఓ డిలీటెడ్ సీనే ఈ ‘అర్జున్ రెడ్డి 2’.

ఈ సినిమాలో బన్నీతో పాటు అక్కినేని వారి వారసుడు సుశాంత్ కూడా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్యా వచ్చే పలు సీన్స్ సినిమాలో ఉన్నా.. అందులో ఒక ఫన్నీ సీన్ ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది.  ఆ సరదా సన్నివేశం లెంత్ ఎక్కువ అవడంతో  తొలగించారు. సుశాంత్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా.. అక్కడకు బన్నీ వస్తాడు. అప్పుడు తాను సరదాగా షూట్ చేసిన వీడియో సుశాంత్ కు చూపిస్తాడు. అందులో అర్జున్ రెడ్డి తరహాలో బాటిల్ ఎత్తకుండా మందుకొడుతోన్న సుశాంత్ రివీలవుతాడు. అర్జున్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూ.. ఇది అర్జున్ రెడ్డి పార్ట్ 2 అని సుశాంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు బన్నీ. అయితే నేనేం చెయ్యాలి అని అమాయకంగా  సుశాంత్ అడుగుతాడు. ఆ తర్వాత సీన్ లో బస్సు వెనకాల సుశాంత్ పరుగుపెడుతూ.. నవ్వులు పూయిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

అల వైకుంఠపురములో డిలీటెడ్ సీన్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=jBnT5tbSpzo&feature=emb_logo

 

Leave a comment

error: Content is protected !!