కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మలిచిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అల్లరిపిల్ల’. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినమా ఘన విజయం సాధించింది. సురేశ్ , మీనా జంటగా నటించిన ఈ సినిమాలో ఇంకా కైకాల సత్యనారాయణ, చిన్న, చిడతల అప్పారావు, సూర్యకళ, లతశ్రీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందిచగా గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు.

రాజు (సురేష్) టాక్సీ డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్. పిచ్చిదైన నందిని (మీనా) తిరుపతిలో అతడికి తటస్థపడుతుంది. అప్పుటి నుండి రాజు, అతని స్నేహితుడు నేత్రానందం (చిన్న) జీవితాలలో ఆమెతో ముడిపడి వరుసగా అనేక సంఘటనలు జరుగుతాయి. సినిమా ప్రారంభంలో, నందినిని వదిలించుకోవడానికి వారి పడే తిప్పలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే, ఆమె తప్పించుకున్న మానసిక రోగి అనీ, ఆమెను సురక్షితంగా తిరిగి అప్పగించిన వారికి బహుమానం ఉందనీ వాళ్ళు తెలుసుకుంటారు.ఈ బహుమానం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుందని కూడా వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. ఆమెను కొన్నాళ్ళు దాచి ఉంచి, ఆ తరువాత అప్పగిస్తే ఎక్కువ బహుమానం పొందవచ్చని భావించి, నందినిని కొంతకాలం దాచాలని నిర్ణయించుకుంటారు.ఆమె పొడవాటి జుట్టును పొట్టిగా కత్తిరించి వారు ఆమె రూపాన్ని కూడా మారుస్తారు. నందిని తన అసలు కథను రాజుకు చెబుతుంది. చివరికి రాజు నందినిని వారి వద్దకు చేర్చడమే మిగతా కథ. నిజానికి ఈ సినిమా మలయాళంలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన మోహన్ లాల్ సినిమా ‘కిలుక్కం’ కి రీమేక్ వెర్షన్. ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో ముస్కురాత్ గా రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!