‘బాహుబలి’ సిరీస్ బ్రహ్మాండ విజయంతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన కారణంగా..ప్రస్తుతం దగ్గుబాటి రానా చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా కేటగిరిలోనే నిర్మాణం జరుపు కుంటున్నాయి. ఆ జాబితాలో ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీ, ఓ టాలీవుడ్ మూవీ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా అడవుల నేపథ్యంలోనే సాగడం ఆసక్తి రేపుతోంది. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం ప్రధానంగా అడవుల నేపథ్యంలోనే సాగుతుంది. అడవుల్లోనే పుట్టిపెరిగి.. జంతువుల మధ్యనే సావాసం చేసే యువకుడు.. జానరణ్యంలోకి రావాల్సివస్తే జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘అరణ్య’ గా తెలుగులోనూ, ‘కాడన్’ గా తమిళంలోనూ .. ఈ సినిమా ఏప్రిల్ 2న హిందీ వెర్షన్ తో సహా విడుదల కానుంది.
ఇక రానా నటిస్తోన్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘విరాట పర్వం’. నైంటీస్ లో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ టైమ్ లో కొంత మంది నక్సల్స్ ఓ ప్రత్యేకమైన కారణంతో .. పోలీసుల కంటపడకుండా అజ్నాతవాసంలో ఉంటారు. ఒక యువకుడు ఆ టీమ్ ను ఎలా లీడ్ చేశాడు? అన్నదే ఈ సినిమా కథ. సాయిపల్లవి మరో ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ప్రియామణి కూడా ఒక కీలకపాత్ర లో కనిపించనుందట. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మూడొంతుల భాగం అడవుల నేపథ్యంలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది.ఇక సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరిలోనే పలు భాషల్లో విడుదల కానుంది. సో మొత్తం మీద దగ్గుబాటి రానా.. ఈ ఏడాది రెండు సినిమాలతో అడవుల బాట పట్టాడన్నమాట.