ఈ సంక్రాంతికి ‘అల .. వైకుంఠపురములో’ మూవీని విజేతగా నిలిపిన హ్యాపీ మూడ్ లో ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నెక్ట్స్ మూవీని తారక్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మేలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ మూవీ టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ వదలడం లేదు. ఈ సినిమాకి ‘అయిననూ.. పోయిరావలె హస్తినకు’ అనే వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ నగర్ టాక్.
వచ్చే సంక్రాంతికి ఎలాగైనా సినిమాను రిలీజ్ చేసి.. ఈ ఏడాది లాగానే బ్లాక్ బస్టర్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. తారక్ సరసన రష్మికామందణ్ణ కథానాయికగా నటించనుండడం విశేషం. మే నెల నాటికి తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా మీదనే ఫుల్ ఫోకస్ పెడతాడట. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత తారక్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న రెండో సినిమా కావడంతో దీనికి మరింత క్రేజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ‘అయిననూ… పోయిరావలె హస్తినకు’ .