అభిమానుల్ని కేవలం తన సినిమాలతో అలరించడమే కాదు హీరో పని. వారిని అన్నివిధాలుగానూ ఆదుకోవడం కూడా వారి కర్తవ్యమే. దాన్ని ఆచరణలో పెట్టి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చరణ్. నెల రోజుల క్రితం హైద్రాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్త తెలిసిన వెంటనే చిరంజీవి సికింద్రాబాద్ లోని వారింటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వచ్చారు.  ఆ సమయంలో విదేశాల్లో ఉన్న చరణ్ తాను హైద్రాబాద్ వచ్చాకా.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాటిచ్చాడు .

అన్న‌ట్లుగానే  ఆదివారం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను  రామ్ చరణ్  తన  ఇంటికి పిలిపించుకొని వారికి 10లక్షల రూపాయల చెక్కు ను అందజేశాడు. నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివని,  ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని  రామ్ చరణ్ గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు  అతడు  దాదాపు 45 నిముషాలు  నూర్ మహ్మద్ కుటుంబంతో  గడిపారు. అభిమానిగా ఆయన చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడాడు. మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని, అదే విధంగా నూర్ మహ్మద్ గారి కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని , అంతే కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తానని చ‌ర‌ణ్‌ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాడు. తన అభిమాని మరణం పట్ల వెంటనే స్పందించిన  రామ్ చరణ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. అలాగే అతడి అభిమానులు అతడు చేసిన మంచి పనికి ఎంతో గర్వపడుతున్నారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=ABPndaQzck0&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!