Shopping Cart 0 items - $0.00 0

అబ్బాయిగారు

 

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘అబ్బాయిగారు’. సెప్టెంబర్ 30, 1993 న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. రాశీ మూవీస్ బ్యానర్ పై నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు ఇవివి సత్యనారాయణ. దీనికి ఇ.వి.వి గురువు జంధ్యాల మాటలు రాయడం విశేషం. మీనా, జయచిత్ర, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జురావు, ఏవియస్, శ్రీకాంత్, పియల్ నారాయణ, జీవా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్టు.  ఇక  ఈ సినిమా కథకి చాలా చరిత్ర ఉంది. అబ్బాయిగారు చిత్రం వాస్తవానికి భాగ్యరాజా తమిళ చిత్రం ‘ఎంగ చిన్నరాజా’ సినిమాకి రీమేక్. అయితే కథ మాత్రం ‘మల్లమన పవాడా’ అనే కన్నడ నవలకి ఆధారం. ఆ నవలను అప్పట్లో అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. అయితే దాని స్ర్కీన్ ప్లే రాసింది మాత్రం మన దర్శకుడైన పి.పుల్లయ్య. దాని  స్ర్కీన్ ప్లే ను స్వయం సిద్ధ అనే బెంగాలి నవల ఆధారంగా రాసుకున్నారు. అదే నవల ఆధారంగా పుల్లయ్య దర్శకత్వంలోనే అప్పట్లో  తెలుగులో అక్కినేని, సావిత్రితో ‘అర్ధాంగి’ గా తెరకెక్కింది. ఇక ఇదే ‘ఎంగ్ చిన్నరాజా’ చిత్రం ఆ తర్వాత హిందీలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా.. బేటా గానూ, కన్నడ లో రవిచంద్రన్ హీరోగా ‘అణ్ణయ్య’గానూ రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!