మణిరత్నం ‘ఓకే బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మాలీవుడ్ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో .. అతడు నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. ఇక ‘మహానటి’ చిత్రంతో డైరెక్ట్ గా తెలుగు ప్రేక్షకుల్ని .. తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతో థ్రిల్ చేసి మరింత దగ్గరయ్యాడు. త్వరలో మరో స్ట్రైట్ మూవీతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.

‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడిపడిలేచె మనసు’ చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ..  త్వరలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. గ‌త కొంత కాలంగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో దుల్కర్ సల్మాన్  సినిమా చేస్తారంటూ వార్త‌లు వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్ట్ వుంటుందా? అన్న విష‌యాల్ని మాత్రం ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కానీ, దుల్క‌ర్ స‌ల్మాన్‌కానీ వెల్ల‌డించ‌లేదు. తాజాగా నిర్మాత అశ్వ‌నీద‌త్ వెల్ల‌డించ‌డంతో ఈ సినిమా ఎలా వుంటుంది? హ‌ను ఎలాంటి క‌థ‌తో దుల్క‌ర్‌ని చూపించ‌బోతున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మరి దుల్కర్ ను హను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!