ఇప్పటి సినిమాల్లో డైలాగ్స్ లో సైతం.. అలవోక గా బూతు మాటలు దొర్లేస్తున్నాయి. సెన్సార్ కూడా చూసీచూడనట్టు వదిలేస్తోంది. అదే ఒకప్పుడైతే.. పాటల్లో ఒక చిన్న పదంలో బూతు ధ్వనించినా.. సెన్సార్ సభ్యులు ఒప్పుకొనేవారు కాదు. దానికి ఒక ఉదాహరణ .. యన్టీఆర్ రాముడు భీముడు సినిమాలో సి.నా.రే తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ ఇటు రావే అనే పాట రాశారు. ఆ పాటలోనే మధ్యలో రమ్మనకు పగలే నను రా రమ్మనకు అనే ఒక లైన్ రాశారు సినారె. దానికి సెన్సార్ వారు అభ్యంతరం చెప్పారట. పగలు రమ్మనకు అంటే రాత్రి రమ్మనమని అర్ధమా? పెళ్లికాని వారి మధ్య ఇలాంటి మాటలు ఉండకూడదు. ఆ లైన్ మార్చండి అన్నారట. అప్పుడు దాన్ని రమ్మనకు ఇప్పుడే నను రా రమ్మనకు అని మార్చారట. అయితే అప్పటికే పాట చిత్రీకరణ అయిపోవడంతో.. ఆడియోలో మాత్రం మార్చగలిగారట. జాగ్రత్తగా గమనిస్తే. ఆ పాటలో యల్ .విజయలక్ష్మి లిప్స్ సింకవ్వవు. పూర్వం సెన్సార్ అంత స్ట్రిక్ట్ గా ఉండేదన్నమాట.