Shopping Cart 0 items - $0.00 0

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ చరణ్ ?

టాలీవుడ్ లో అపజయాలు ఎరుగని దర్శకుల జాబితాలోకి అనిల్ రావిపూడి పేరు కూడా చేరిపోయింది. రీసెంట్ గా మహేశ్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వురు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి..ఆ విషయంలో  ఇండస్ట్రీలో మరింత క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు . ఇప్పుడు అనిల్ రావిపూడి  ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తెరెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో వెంకీ, వరుణ్ తేజలతో పాటు రవితేజ గానీ, మహేశ్ బాబు కానీ నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే..  అనిల్ ఈ మూవీ తర్వాత వరుసగా పలువురు స్టార్ హీరోలతో సినిమాల్ని లైన్ లో పెట్టుకుంటున్నాడు.  ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా అనిల్ ఒక సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

గతంలో వీరిద్దరి కాంబో లో ఒక మూవీ రానున్నట్టు వార్తలొచ్చినా.. అది కేవలం రూమర్ గా మాత్రమే మిగిలిపోయింది. కానీ తాజా సమాచారం ప్రకారం అనిల్ నిజంగానే రామ్ చరణ్ ను కలిసి ఒక అదిరిపోయే లైన్ చెప్పాడట. దానికి ఇంప్రెస్ అయిన చెర్రీ.. ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట. అన్నీ కుదిరితే.. ఈ సినిమా మేలోనే లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం అనిల్ ‘ఎఫ్ 3’ లో మూడో హీరోను సెట్ చేసే పనుల్లో ఉన్నాడు.  ఒక వేళ దానికి  హీరో సెట్ అయితే.. ఆ సినిమానే ముందు సెట్స్ మీదకు వెళుతుందని,  లేని పక్షంలో చరణ్ హీరోగా  సినిమా మొదలు పెట్టనున్నాడని సమాచారం. మరి అనిల్ ముందుగా ఏ సినిమా చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!