అక్కినేని వారి కనిష్ట వారసుడు అఖిల్ .. ఇప్పటి వరకూ ముచ్చటగా మూడు చిత్రాల్లో హీరోగా నటించాడు.  కానీ ఒక్క సినిమాతోనూ విజయం సాధించలేక తండ్రి నాగ్ కు తీవ్రంగా నిరాశ కలిగించాడు. ‘అఖిల్, మిస్టర్ మజ్ను, హలో’ చిత్రాల్లో అఖిల్ బాబు కనీసం ఒక్క హిట్టైనా కొట్టలేకపోవడం అభిమానుల్ని సైతం బాధ పెడుతోంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అనే ప్రేమకథా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ తో పాటు  భాస్కర్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగోలేదు కాబట్టి.. నాలుగోసారైనా మనోడు హిట్టు కొడతాడనే గ్యారెంటీ లేదు. అందుకే అఖిల్ ఐదో సినిమా కోసం నాగార్జున ఒక సూపర్ స్కెచ్ వేశాడని వినికిడి.

ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బాక్సాఫీస్ హోరెత్తిపోయే రేంజ్ లో హిట్టు కొట్టిన అనిల్ రావిపూడి చేతుల్లో అఖిల్ ను పెట్టాలని నాగార్జున ప్లాన్. దానికోసం ఆయన అనిల్ రావిపూడికి అదిరిపోయే రేంజ్ లో ఆఫర్ ఇచ్చాడట. ప్రస్తుతం అనిల్ ‘ఎఫ్ 3’ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. దాంతో పాటు మరో వైపు అఖిల్ కోసం ఓ ట్రెమెండస్ లవ్ స్టోరీని కూడా సెట్ చేసే హడావిడిలో ఉన్నాడట. మరి వరుస ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ కు ..  అపజయం అంటూ లేకుండా టాలీవుడ్ లో దర్శకుడిగా దూసుకుపోతోన్న అనిల్  ఏ రేంజ్ సినిమా ఇస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!