కొన్ని పాత్రలు కొంతమంది చేస్తేనే రక్తి కడతాయి. అలాంటి పాత్రలు వేరే వారు పోషిస్తే.. కాస్తంత బెరుకు, భయం ఉంటాయి. అలాంటి పరిస్థితి అక్కినేని నాగేశ్వరరావుకి ఎదురైంది. ఆయన నటించిన ‘బీదలపాట్లు’ సినిమా విషయంలో జరిగింది అదే. ఈ సినిమాకి బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. జానపద చిత్రాలకు చిరునామాగా నిలిచిన విఠలాచార్య .. దర్శకత్వం వహించిన సాంఘిక సినిమాల్లో ఇది కూడా ఒకటి. సినిమా జయాపజయాల సంగతి పక్కనపెడితే… అందులో అక్కినేని చేసిన పాత్రను తమిళంలో చిత్తూరు వి నాగయ్య పోషించారు.

నిజానికి ముందుగా..  పక్షి రాజావారు 1950లో ‘బీదలపాట్లు’ పేరుతో తెలుగులో ఒక సినిమా  నిర్మించారు. తమిళంలో ‘ఏళై పడుంపాడు’. రెండూ ఒకేరోజున విడుదలయ్యాయి. ప్రధాన పాత్రను చిత్తూరు నాగయ్యే రెండు చిత్రల్లోనూ ధరించారు. ఇందుకు ఆయనకు లక్షరూపాయల పారితోషికం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో ఒక నటుడికి అంత పారితోషికం రావడం అదే తొలిసారి! అదే కథ, పేరుతో విఠలాచార్య 1972లో మరో సినిమా నిర్మించారు. నాగయ్య ధరించిన పాత్రను అక్కినేని నాగేశ్వరరావు చేశారు. నాగయ్య, చర్చిలోని ఫాదర్‌ పాత్ర ధరించారు. నాటి సినిమాలో కొళకళత్తూర్‌ శ్యామ- అనే ఆయన రెండు భాషల్లోనూ పాత్రపోషణ చేశారు. తొలిరోజున నాగయ్య, నాగేశ్వరావులు వున్నప్పుడు ‘‘మీరు ఎంతో అద్భుతంగా నిర్వహించిన పాత్రను నేను నిర్వహిస్తున్నాను. సాహసిస్తున్నందుక మీ ఆశీస్సులు అందజేయండి’’ అని పాద నమస్కారం చేశారట  అక్కినేని వినమ్రతతో. అదీ అక్కినేని వినయం.

 

 

 

Leave a comment

error: Content is protected !!