దశాబ్దం కిందట బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ కు తిరుగే ఉండేది కాదు. అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న ఇండియన్ హీరోగా ఆయన పాపులారిటీ ఓ రేంజ్ లో ఉండేది. దానికి తగ్గట్టే ఆయన మార్కెట్టు , సినిమాల లైనప్ ఓ రకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఆయన పేరు కనీసం  ఇండియన్ హీరోస్  టాప్ 10 లిస్ట్ లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  ఆయన ఎర్లియర్ మూవీ ‘జీరో’ .. ఆయన కెరీర్ గ్రాఫ్ నే  పూర్తిగా జీరో చేసేసింది.  ఈ మూవీ తర్వాత పూర్తిగా పునరాలోచనలో పడిన షారుఖ్ దాదాపు ఏడాదికి పైగా విరామం తీసుకున్నాడు.

ఎట్టకేలకు షారుఖ్ భాయ్ కొత్త చిత్రం అనౌన్స్ మెంట్ జరిగిందని టాక్. ఈ వేసవి నుంచి ఆయన ముఖానికి రంగు వేసుకోనున్నాడు. వరుసగా నాలుగు చిత్రాలతో సౌత్ లో స్టార్ స్టాటస్ తెచ్చుకున్న అట్లీ షారుఖ్ ను తిరిగి ఫామ్ లోకి తెచ్చే బాధ్యత తీసుకున్నాడట. వీళ్ల కాంబినేషన్ గురించి కొన్ని నెలలుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. తాజాగా అట్లీ స్క్రిప్టుకు షారుఖ్ ఆమోద ముద్ర వేశాడని.. ఈ చిత్రాన్ని ఆయన సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తాయని సమాచారం.బిగిల్ తర్వాత అట్లీ తన తదుపరి చిత్రాన్ని ఏ తమిళ హీరోతోనూ ప్రకటించని నేపథ్యంలో కింగ్ ఖానే అతడి తదుపరి హీరో అని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాకా రాజ్ కుమార్ హిరానీతో షారుఖ్ ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే.. తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తాడట. మరి అట్లీ షారుఖ్ ను బాలీవుడ్ లో తిరిగి కింగ్ ఖాన్ ను చేస్తాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!