ఇప్పటి హీరోలు .. రైటర్ రాసిన డైలాగ్స్ ను  ఇంప్రవైజేషన్ పేరుతో మార్చేస్తుండడం  తరుచుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో మాటల రచయిత రాసిన డైలాగ్స్ ను ఒక్క పిసర మార్చినా కూడా ఒప్పుకొనేవారు కాదు. అదీ అప్పటి క్రమశిక్షణ. ఈ విషయంలో బడా ప్రొడ్యూసర్ దుక్కిపాటి మధుసూదనరావు చండశాసనుడు. అన్నపూర్ణ సంస్థకు అక్కినేనితో పాటు ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే.. ఒకరోజు. అక్కినేని ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో తర్వాత సీన్ కు సంబంధించిన డైలాగ్స్ ను ఏదో కాస్త మార్చి ప్రిపేర్ అవుతున్నారట. దూరం నుంచి దాన్ని చూస్తున్న దుక్కిపాటి .. హఠాత్తుగా అక్కినేని దగ్గరకొచ్చి. ఏంటి? నాగేశ్వరరావు డైలాగ్ ను ఏదో మారుస్తున్నట్టున్నావు? అని అడిగారట. దానికి అక్కినేని అబ్బే మార్చడం లేదండీ.. నా సౌలభ్యం కోసం పదాల్ని కాస్త అటు, ఇటు అంటూ పలుకుతున్నానంతే.. అన్నారట. దానికి దుక్కిపాటికి కోపం వచ్చి.. మూడు నెలల నుంచి ఆ డైలాగ్స్ ను చదువుతున్న మాకు ఆ సౌలభ్యం తెలియదా? అని అడిగారట. వెంటనే అక్కినేని సరేనండి.. అందులో ఉన్నది ఉన్నట్టే చెబుతాను లెండి అని ఆయన్ని కూల్ చేశారట. దటీజ్ దుక్కిపాటి. ఆ రోజుల్లో డైలాగ్ రైటర్ కు నిర్మాతలిచ్చే విలువ అది.

Leave a comment

error: Content is protected !!