రీసెంట్ గా ‘భీష్మ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి…జోరుమీదున్నాడు నితిన్. ఆ సినిమా సక్సెస్ ఎంజాయ్ మెంట్ లో ఉన్న మనోడు.. అదే ఊపులో తదుపరి చిత్రాన్ని అప్పుడే లైన్ లో పెట్టేశాడు. నిన్ననే  ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్టయి నేషనల్ అవార్డు ను సైతం అందుకున్న ‘అంధాధున్’ చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి.. టబు అభినయమే హైలైట్ . అందుకే తెలుగు వెర్షన్ కు టబును అదే పాత్ర కోసం సంప్రదించారట. అయితే అమ్మడు వెంటనే దానికి అంగీకరించినా..  దాదాపు రూ. 1కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ను కోట్ చేసి నిర్మాతలకు షాకిచ్చిందట. అంత పెద్ద ఎత్తున పారితోషికం అడగడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. టబును తీసుకోవడమా లేక ఆమె ప్లేస్ లో వేరొక నటీమణిని ఎంపిక చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారట. మరి తెలుగు ‘అంధాధున్’ లో టబు ఉంటుందో లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!