భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలకమైన బౌలర్ గా వెలిగిన హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఎన్నో కీలకమైన మ్యాచుల్ని తన బౌలింగ్ మాయాజాలంతో గెలిపించిన చరిత్ర అతడిది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నఆ క్రికెట్ యోధుడు ఇప్పుడు .. ఆ పాప్యులారిటీనే వెండితెరకు షిఫ్ట్ చేయనున్నాడు. అదేనండీ.. మన భజ్జీ హీరో అయిపోతున్నాడు. ‘ఫ్రెండ్ షిప్’ అనే టైటిల్ తో తమిళంలో రానున్న సినిమా లో హర్భజన్ సింగ్ పూర్తి స్థాయిలో హీరోగా నటించబోతున్నాడు.

జాన్ పాల్ రాజ్ , శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను హర్బజన్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. బేడీలు తగిలించిన రెండు చేతులు .. ఒక పెద్ద మైదానం బ్యాక్ డ్రాప్ లో రివీలయ్యాయి. సీన్ టోయా స్టూడియోస్ బ్యానర్ పై జేపీ ఆర్ బీ స్టాలిన్ నిర్మిస్తోన్న ఫ్రెండ్ షిప్ అతి త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత  భజ్జీ ఫుల్ టైమ్ హీరోగా కొనసాగుతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!