డిస్కవరీ ఛానల్ లో అందరూ ఎంతో ఇష్టంతో చూసే అడ్వెంచరస్ షో ‘ఇన్ టు ది వైల్డ్’ . బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు ఒళ్ళు గగుర్పొడుస్తాయి. అలాంటి షో లో సెలబ్రిటీస్ పాల్గొనే ఎపిసోడ్స్ ను వరుసగా చేస్తున్నారు. అందులో మొదటగా భారత ప్రధాని నరేంద్రమోడి ఎపిసోడ్ ప్రసారమై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తలైవా రజనీకాంత్ వంతు వచ్చింది. ఈ షోలో రజనీ పాల్గొన్న ఎపిసోడ్ ను ఈ నెల 23న డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. దానికి ముందు ఒక స్నీక్ పీక్ వీడియో ను విడుదల చేశారు నిర్వాహకులు.
రజనీకాంత్ 70 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో , డెడికేషన్ తో ఈ షోలో పాల్గొన్నారు. బేర్ గ్రిల్స్ తో తన కెరీర్ గురించి, తన లైఫ్ స్టైల్ గురించి రజనీ తనదైన శైలిలో వేదాంత ధోరణిలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అలాగే ఒక రోప్ పట్టుకొని బేర్ తో ఒక గుట్ట ఎక్కి షాకిచ్చారు. బేర్ గ్రిల్స్ .. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీ వయసు ఎంత అని అడిగాడు. రజనీ నవ్వుతూ ఐయామ్ సెవంటీ అన్నారు. దాంతో షాకయిన బేర్ గ్రిల్స్ .. యూవార్ యాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పడం ఈ స్నీక్ పీక్ లో హైలైట్ . మరి రజనీసారు వాడు పార్టిసిపేట్ చేసిన ఈ ఎపిసోడ్ ఏరేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
‘స్నీక్ పీక్ వీడియో ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.