కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం షూటింగులకు అనుమతివ్వడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే కరోనా తీవ్రత రోజురోజుకి ఎక్కువ అవుతుండటంతో స్టార్ హీరోలెవరూ సెట్స్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేయడం లేదు. కానీ కింగ్ నాగార్జున మాత్రం  తాజా సినిమా ‘వైల్డ్ డాగ్’ తో  సెట్లోకి అడుగుపెట్టేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో  నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా ‘ఊపిరి’కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అహిషోర్ సాల్మోన్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు నాగ్. దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సయామి ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుగునున్న ఈ సినిమాకి కరోనా బ్రేక్స్ వేసింది. ఇప్పుడు తిరిగి ప్రారంభమైన ఈ సినిమా  షూటింగ్ లో వారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అభిమానులకు చెప్పడానికి ‘వైల్డ్ డాగ్’ మేకర్స్ షూటింగ్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. లీడ్ యాక్టర్స్ తో సహా టెక్నీషియన్స్ బాయ్స్ అందరూ సెట్స్ లో అడుగుపెట్టింది మొదలు శానిటైజర్స్ మాస్కులు వంటివి వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ కనిపించారు. నాగార్జున సైతం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మేకింగ్ వీడియో వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=1&v=zULoKqddvPw&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!