తమిళ సీనియర్ హీరోయిన్ జ్యోతిక .. రీఎంట్రీ లో వరుసగా  లేడీ ఓరియెంటెడ్ మూవీస్ నే చేసుకుంటూ వెళుతోంది. ఆ ప్రయత్నంలో పలు హిట్స్ కూడా అమ్మడు ఖాతాలో వేసుకుంది. ఎర్లియర్ గా ‘రాక్షసి, జాక్ పాట్ , తంబీ’  చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం పలకరించిన జ్యోతిక ఈ ఏడాది ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ తో రాబోతోంది. అందులో జ్యోతిక లాయర్ గా నటిస్తోంది. సినిమా పేరు ‘పొన్ మగళ్ వందాళ్’ . ‘డిలే ఇన్ జస్టిస్ ఈజ్ ఇన్ జస్టిస్’ (న్యాయం జరగడంలో లేటయితే.. అది అన్యాయం  కింద లెక్క) అనే క్యాప్షన్ తో .. అత్యాచారానికి గురైన ఒక అమ్మాయికి న్యాయం చేయాలని కంకణం కట్టుకొనే వకీల్ పాత్రలో జ్యోతిక నటిస్తోంది.

జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో సూర్య ఓన్ ప్రొడక్షన్ హౌస్  2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా తాలుకా సెకండ్ లుక్ పోస్టర్  ను విడుదల చేశారు.  నల్లకోటు ధరించి.. ఒక ఫైల్ పట్టుకొని రివీలైన జ్యోతిక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగులో కూడా విడుదల కానున్న ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!