సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాలు, సాధించిన రికార్డులు ఏ హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన సినీ కెరీర్ లో 350పైగానే చిత్రాల్లో నటించారు. అందులో 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు అయితే, 200వ చిత్రం ఈనాడు. కాగా.. ఆయన నటించిన 300వ చిత్రంగా ‘తెలుగువీర లేవరా’ విశేషాన్ని సంతరించుకుంది. 1995, సెప్టెంబర్ 29న విడదులైన ఈ సినిమా నేటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ అయిన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. సినిమా అనుకున్న రీతిలో అలరించకపోయినా.. ఆయనకిది ల్యాండ్ మార్క్ మూవీ అయింది. రోజా, కోట శ్రీనివాసరావు, చరణ్‌ రాజ్‌, మహేష్ ఆనంద్‌, రాజనాల, శ్రీహరి, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి.

అప్పటికి 299 చిత్రాలు కంప్లీట్ చేసిన కృష్ణ.. తన 300వ చిత్రం కోసం ‘అల్లూరి సీతారామరాజు’ మూవీ  లోని పాత్రను ప్రేరణగా తీసుకొని కథ రెడీ చేయించారు.  అంతే కాదు.. అదే సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ .. తెలుగు వీర లేవరా  అనే పాట పల్లవినే టైటిల్ గా పెట్టుకున్నారు.  ఈ సినిమా లో  ఆయన పేరు రామరాజు. స్వార్ధ రాజకీయనాయకులు .. ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు .. రామరాజు లోని దేశభక్తిని నిలువెల్లా నింపుకొన్న కథానాయకుడు .. వారికి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథ. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసే ఈవివి సత్యనారాయణ తొలిసారిగా.. తన బాణీని పక్కనపెట్టి.. పూర్తి స్థాయిలో దేశభక్తి చిత్రంగా దీన్ని మలిచారు.

 

Leave a comment

error: Content is protected !!