మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ లో సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాడు కొరటాల. ఆ క్రమంలో  సినిమా ను శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు. ఇక   దీని  తర్వాత మెగాస్టార్ ఏ సినిమా చేయబోతున్నారు అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే  ఆయన 153 మూవీకి సంబంధించిన ఒక వార్త అంతటా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుందని, మూడొంతులు ఈ ప్రాజెక్ట్ ఖాయమని టాక్.

లాస్టియర్ మలయాళంలో సూపర్ హిట్టైన మోహన్ లాల్ ‘లూసిఫర్’ సినిమా రైట్స్ రామ్ చరణ్ తీసుకున్నసంగతి తెలిసిందే. మోహన్ లాల్ పాత్రలో మెగాస్టార్ నటించబోతున్నారని సమాచారం. పృధ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ పొలిటికల్ థ్రిల్లర్ కు తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారట సుకుమార్ రైటింగ్ టీమ్. అయితే ఈ సినిమాను సుక్కూ డైరెక్ట్ చేస్తున్నాడా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. ఈ ప్రాజెక్ట్ లోకి సుక్కూగానీ ఎంటరైతే.. ఆ కాంబినేషన్ ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి సుక్కూ లూసిఫర్ గా మెగాస్టార్ ఎలా ఉండబోతాడో .. వెయిట్ అండ్ సీ..

Leave a comment

error: Content is protected !!