మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కలయిక లో తెరకెక్కుతోన్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్ ). ఆగష్ట్ లో విడుదల చేయడానికి కొరటాల ఈ చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు. దేవదాయ శాఖలోని అవినీతిని ఎండగట్టడానికి వచ్చిన ఆఫీసర్ ‘ఆచార్య’గా చిరు చెలరేగనున్న ఈ సినిమా లో చిరంజీవి టీనేజ్ లో ఉన్నప్పటి పాత్ర ను రామ్ చరణ్ పోషిస్తోన్నట్టు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని చిరంజీవి మాస్ స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకూ ఈ సిినిమాకు సంబంధించిన చిరు లుక్ బైటికి రాలేదు. ఇదే మొదటి సారి కావడంతో అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది.
గ్రీన్ షర్ట్ , బ్లాక్ ఫ్యాంట్స్, మెడలో రెడ్ స్కార్ఫ్ ధరించి సింహంలా సీరియస్ గా చూస్తోన్న చిరంజీవి వర్కింగ్ స్టిల్ కు మెగాభిమానులు ఫిదా అయిపోతున్నారు. గతంలో ‘ముఠా మేస్త్రి’ చిత్రంలో ఇలాంటి కాస్ట్యూమ్స్ నే చిరు ధరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోజులో ఆయన ఆ మాస్ మేస్త్రిని తలపిస్తూండడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. మరి ‘ఆచార్య’ చిత్రం తో మెగాస్టార్ ఏ రేంజ్ లో రికార్డు లు క్రియేట్ చేస్తాడో చూడాలి.