రెండేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో కంబ్యాక్ ఇస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వరుస సినిమాలతో అభిమానులకు సర్ ప్రైజుల మీద సర్ ప్రైజులు ఇస్తున్నాడు. మొత్తం మీద ఏకంగా ఐదు ప్రాజెక్టులకు పవన్ కమిట్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  ఒక పక్క దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు ‘వకీల్ సాబ్’ సెట్స్ మీద ఉండగానే.. మరో పక్క క్రిష్ దర్శకత్వంలో ని మరో సినిమాను సైతం పవన్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలోని పవన్ కళ్యాణ్ కేరక్టర్ ను డిజైన్ చేశాడట క్రిష్. పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ లో సాగే.. ఓ ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్.

ఇక ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే అదిరిపోయే టైటిల్ ను రిజిస్టర్ చేశారట. వీర అనే పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తాడట.  మన దేశాన్ని మొఘలులు పాలించే కాలంలో రాబిన్ హుడ్ లాంటి ఓ దొంగ చేసిన తిరుగుబాటే ఈ సినిమా కథ అంటున్నారు. కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గానూ, ప్రగ్యా జస్వాల్ సెకండ్ హీరోయిన్ గానూ నటిస్తున్నట్టు వినికిడి. కీరవాణి సంగీతం అందిస్తోన్న ‘విరూపాక్ష’ చిత్రం పవర్ స్టార్ కు ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!