Shopping Cart 0 items - $0.00 0

విజయ్ దేవరకొండ – పూరీ చిత్రంలో అనన్య పాండే

టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కలయికలో ప్రస్తుతం సెట్స్ మీదున్న చిత్రం ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్ ).  దీనికి ‘లైగర్’ గా పేరు మార్చుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి.  విజయ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నటిస్తోన్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో  అనన్యపాండే కథానాయికగా నటిస్తోన్నట్టు విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్ లో రివీల్ చేశాడు. విజయ్ కు ఈ సినిమా తొలి పాన్ ఇండియా చిత్రం కానుండడం విశేషం. ఇక ఇందులో బాక్సర్ గా కనిపించడం కోసం తన శరీరాకృతిని సైతం మార్చుకొని .. దానికి తగ్గట్టుగా థాయ్ ల్యాండ్ లో  బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు విజయ్.

ఇక ఈ  చిత్రంలో  విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ..  హిందీలో ఈ సినిమా హక్కుల్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. తెలుగు , హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ సినిమా విడుదల కాబోతోంది. ఈ ఏడాది వేసవిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. విజయ్ ఎర్లియర్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అభిమానుల్ని నిరాశ పరచడంతో ఈ సినిమా మీద పూర్తిగా కాన్సెన్ ట్రేట్ చేస్తున్నాడు విజయ్. ‘ఇస్మార్ట్ శంకర్’ తో లాస్టియర్ బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో పూరీ జగన్నాథ్ పనితనం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా విజయ్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!