ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఒణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. జన స్వీయ నిర్బంధంలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ టైమ్ లో దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమనే నమ్మకొన్న కొంత మంది కార్మికులకు ఉపాథి లేకుండా పోయింది. అందుకే ‘సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా’ (FEFSI) కి విజయ్ సేతుపతి , శివకార్తికేయన్ ఒక్కొక్కరూ రూ. 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.
ఇక ఇదే సంస్థకి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. దీని అధ్యక్షుడు ఆర్.కే.సెల్వమణి (రోజా భర్త ) మాట్లాడుతూ.. మొత్తం మా సంస్థలో ఉన్న 15వేల ఉద్యోగస్తులకు రైస్ బ్యాగ్స్ అందజేయడానికి మాకు మొత్తం రూ. 2కోట్లు వరకూ ఖర్చు అవుతుంది. అందులో మూడో వంతు రజినీ సార్ విరాళం రూపంలో ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందని రజినీ ఔదార్యాన్ని సెల్వమణి మెచ్చుకున్నారు.