రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ తెలుగు లో పర్వాలేదనిపించుకుంది. తమిళంలో మాత్రం దాని జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో వైపు తలైవా తదుపరి సినిమా పనులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన 168వ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అజిత్ తో ‘వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం’ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ దీనికి దర్శకుడు. ఇక ఈ సినిమాకి ‘అన్నాత్త’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇక ఈ మూవీలో రజనీకాంత్ సరసన ఖుష్బూ , మీనా నటిస్తూండగా.. కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించనుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కున్న ఈ సినిమా లో రజనీ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఆయన కెరీర్ లోనే ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని వినికిడి. ఇక ఈ సినిమా తెలుగులో కూడా వస్తుందని వేరే చెప్పాలా? అయితే తెలుగులో ఏ టైటిల్ పెట్టబోతున్నారో అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.