విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ నటించిన ఫాంటసీ మాస్ ఎంటర్ టైనర్ యమగోల 1977లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ముందుగా అనుకున్న హీరో బాలకృష్ణ. రచయిత డి.వి.నరసరాజు బ్రహ్మాండమైన కథ, సంభాషణలు రాసి.. నిర్మాత వెంకట రత్నం తో కలిసి యన్టీఆర్ దగ్గరకు వెళ్ళారు. ఆయనకి కథ వినిపించి.. ఇందులో బాలయ్య హీరోగానూ, మీరు యముడిగానూ నటిస్తే బాగుంటుందని చెప్పారట. దానికి యన్టీఆర్ చిరునవ్వు నవ్వి.. బ్రదర్ .. మేం బాలయ్యని బైట సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. అతడి చదువుకి ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. అని చెప్పి..అందులో హీరోగా తనే నటిస్తానని, యముడిగా సత్యనారాయణను తీసుకోండని సజెస్ట్ చేశారట. అలా యమగోల లో యన్టీఆర్ హీరో అయిపోయి.. ఆ సినిమా ఘనవిజయానికి ముఖ్యకారకులయ్యారు.

Leave a comment

error: Content is protected !!