విశ్వవిఖ్యాత నటసార్వభౌమ  డా.నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు ఇటు దర్శకుడు క్రిష్ , అటు రామ్ గోపాల్ వర్మ. యన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తండ్రి పాత్రను పోషించినా సరే.. కొన్ని వాస్తవాల్ని దాచిపెట్టారనే కారణంతో సినిమా మీద అంతగా ఆసక్తి చూపించలేదు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మరోసారి యన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే.. ఇది వెబ్ సిరీస్. ‘చదరంగం’ పేరుతో త్వరలో జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీద స్ట్రిమింగ్ కానున్న ఈ బయో సిరీస్ లో యన్టీఆర్ గా శ్రీకాంత్ నటించనుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘చదరంగం’ వెబ్ సిరీస్ లాస్ట్ ఇయరే ప్రారంభం అయింది. ఇప్పుడు అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. యన్టీఆర్ నట, రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలపై ఈ బయో సిరీస్ తెరకెక్కినట్టు సమాచారం. మరో ముఖ్య విశేషం ఏంటంటే..  మంచు మోహన్ బాబు నిర్మాణంలో ఈ బయో సిరీస్ తెరకెక్కడం విశేషంగా మారింది.  అంతేకాదు .. ఇందులో వాస్తవాల్ని మాత్రమే చూపించబోతున్నారట. మరి ‘చదరంగం’ బయో సిరీస్ తో శ్రీకాంత్ అయినా యన్టీఆర్ పేరు నిలబెడతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!