మాస్ మహారాజా రవితేజకి ముందు నుంచీ స్పీడ్ గా సినిమాలు చేసేసి.. వరుసగా విడుదల చేయడం అలవాటు. అయితే కొంతకాలంగా రాజా స్పీడ్ తగ్గింది. వరుస పరాజయాలతో కెరీర్ గాడి తప్పడంతో అతడు కావాలనే వేగం తగ్గించాడు. అయితే ఈ ఏడాదిని ‘డిస్కోరాజా’ మూవీ తో బోణీ చేసిన మాస్ మహారాజా .. మునుపటి వేగంతో మళ్ళీ వరుస మూవీస్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న గోపీచంద్ మలినేని చిత్రం ‘క్రాక్’. అతడి పుట్టిన రోజు సందర్భంగా నేడు ఆ సినిమా విడుదల తేదీని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్ రీలీజ్ చేశారు నిర్మాతలు. ‘క్రాక్’ మూవీని మే 8 న విడుదల చేయనున్నారు. పోలీసాఫీసర్ గెటప్ లో రవితేజ సీరియస్ గా చూస్తున్న లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
అలాగే ఈ రోజే అతడి కొత్త సినిమాకు సంబంధించిన లుక్ కూడా విడుదలయింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల కానుందని సమాచారం. మొత్తానికి మాస్ మహారాజా ఇధివరకటి స్పీడ్ లో మళ్లీ సినిమాల్ని వరుసగా పట్టాలెక్కించనుండడం శుభ పరిణామమే. మరి మే 8న రానున్న క్రాక్ పోలీసాఫీసర్ ఎంత సక్సెస్ ఫుల్ గా డ్యూటీ చేస్తాడో చూడాలి.