ఆయన పాడితే.. రాళ్ళు సైతం ఆ రాగాలకు తన్వయత్వం చెందుతూ కరిగి కన్నీరైపోతాయి. శిశువులు, పశువులే కాదు.. పాములు కూడా పడగ విప్పి ఆడుతూ ఆయన పాట గొప్పతనానికి నిదర్శనం గా నిలిచిపోతాయి. ఆ శ్రావ్యత, స్వచ్ఛత , పద ఉచ్ఛారణ ఆయనకు మాత్రమే సాధ్యం.  పేరు హరిహరన్. అందరూ పిలుకొనే ముద్దు పేరు మెలోడీ మాంత్రికుడు.

‘నిన్నే పెళ్లాడతా’లో ‘‘కన్నుల్లో నీ రూపమే’’, ‘ఇంకా ఏదో’, ‘మాస్టర్‌’లో ‘‘తిలోత్తమా’’, ‘ప్రియరాగాలు’లో ‘‘చినుకు తడి’’, ‘ఎగిరే పావురమా’లో ‘‘రూనా లైలా వానలాగా’’, ‘చూడాలని ఉంది’లో ‘‘యమహా నగరి’’, ‘ఆవిడా మా ఆవిడే’లో ‘‘ఓం నమామి’’, ‘ఆటోడ్రైవర్‌’లో ‘‘చందమామ’’, ‘సూర్యవంశం’లో ‘‘రోజావే చిన్నిరోజావే’’, ‘గణేష్‌’లో ‘‘రాజహంసవో’’, ‘సుస్వాగతం’లో ‘‘సుస్వాగతం నవరాగమా’’, ‘బావగారు బాగున్నారా?’లో ‘‘నవమి దశమి’’, ‘శీను’లో ‘‘ప్రేమంటే ఏమిటంటే’’, ‘‘ఏమని చెప్పను’’, ‘మా అన్నయ్య’లో ‘‘నీలి నింగిలో’’, ‘యువరాజు’లో ‘‘తొలివలపే’’, ‘నిన్నే ప్రేమిస్తా’లో ‘‘ప్రేమలేఖ రాసెను’’, ‘అన్నయ్య’లో ‘‘హిమ సీమల్లో’’, ‘‘వాన వల్లప్ప’’, ‘బాగున్నారా’లో ‘‘కళ్ళు కళ్ళు కలిసాక’’, ‘మనోహరం’లో ‘‘చూడ చక్కని’’, ‘కలిసుందాం రా’లో ‘‘నువ్వే నువ్వే’’, ‘నువ్వు వస్తావని’లో ‘‘కొమ్మా కొమ్మా’’, ‘ఆజాద్‌’లో ‘‘సుడిగాలిలో తడి ఊసులు’’, ‘‘కల అనుకో కథ అనుకో’’, ‘చిరునవ్వుతో’లో ‘‘కనులు కలిసాయి’’, ‘నరసింహ నాయుడు’లో ‘‘నిన్నా కుట్టేసినాది’’, ‘బావ నచ్చాడు’లో ‘‘అనురాగం అనురాగంలో’’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’లో ‘‘మళ్ళీ కూయవే’’, ‘ఎదురులేని మనిషి’లో ‘‘ఏనాడైనా అనుకున్నానా’’, ‘‘మనసన్నది అన్నది’’, ‘‘ఏమైందమ్మా ఈనాడు’’, ‘మృగరాజు’లో ‘‘శతమానమన్నదిలే’’, ‘డాడీ’లో ‘‘గుమ్మాడి గుమ్మాడి’’, ‘సింహరాశి’లో ‘‘తెలుసా నేస్తమా’’, ‘అమృత’లో ‘‘ఏ దేవి వరమో నీవో’’, ‘నీతో’లో ‘‘నవ్వాలి నీతో’’, ‘ఇంద్ర’లో ‘‘భం భం బోలే’’, ‘నాగ’లో ‘‘ఒక కొంటె పిల్లనే’’, ‘జానీ’లో ‘‘ఈ రేయి తీయనిది’’ వంటి హిట్స్‌ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’లో ‘‘నీలిరంగు చీరలోనా’’, ‘సోగ్గాడే చిన్ని నాయన’లో ‘‘వస్తాలే వస్తాలే’’, ‘ఖైదీ నెంబర్‌ 150’లో ‘‘యూ అండ్‌ మీ’’ వంటి పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇలా కేవలం తెలుగు ప్రేక్షకులని కాకా తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజపురి, బెంగాలీ ప్రేక్షకులను కూడా తన స్వరంతో మంత్రముగ్దుల్ని చేశారు హరిహరన్.

2004లో హరిహరన్‌కు పద్మశ్రీ పురస్కారం వరించింది. 2011లో బెస్ట్‌ సింగర్‌గా కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాన్ని అందుకొన్నారు. 2004లో భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో అత్యుత్తమ కృషి చేసినందుకు స్వరాలయ కైరాలి ఏసుదాస్‌ పురస్కారాన్ని అందుకున్నారు. హరిహరన్‌ ఖాతాలో తమిళనాడు రాష్ట్ర సినిమా పురస్కారాలు కూడా ఉన్నాయి. ‘అన్నయ్య’ సినిమాలో ‘‘హిమ సీమల్లో’’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడు విభాగంలో నంది పురస్కారం హరిహరన్‌ను వరించింది. ఇంకా ఏషియా నెట్‌ ఫిల్మ్‌ పురస్కారాలు, కళాకర్‌ పురస్కారాలు, ఫిలింఫేర్‌ పురస్కారాలు, విజయ్‌ పురస్కారాలు కూడా హరిహరన్‌ ఖాతాలో ఉన్నాయి. ఈరోజు హరిహరన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ మెలోడీ మాంత్రికుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే హరిహరన్

Leave a comment

error: Content is protected !!