సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శక మేథావి.. టెక్నాలజీ తెలిసిన వ్యక్తి.. టాకీ యుగంలో కూడా ‘పుష్పకవిమానం’ లాంటి మూకీ సినిమా తీసి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందులో మాటలు లేకుండా.. కేవలం భావంతోనే సీన్స్ అన్నిటినీ పండించారు. అయితే సింగీతం మొదటి సినిమా ‘నీతి నిజాయితీ’ లోని హీరో కూడా మూగవాడే. అందులో ఆ పాత్ర మాట్లాడలేదు. అందుకే భాషతో పనిలేదు కాబట్టి. .ఇందులో పరభాషా నటుడ్ని హీరోగా తీసుకున్నారు. అతడి పేరు సతీష్ అరోరా.
అతనికి హీరోయిన్ కాంచనకీ డ్యూయెట్ పెట్టారు. మూగవాడు మాట్లాడ లేడు గాని, ‘‘ఉ ఉ…వూ…’’ అంటాడు. అంచేత, అదే మూగ భాషలో అతను హమ్ చేస్తే హీరోయిన్ పాడుతుంది. విశేషం ఏమిటంటే ఆ మూగ పాటని ఆ చిత్రం సంగీత దర్శకుడు రాజేశ్వర్రావు పాడారు. అలా మొదటి సినిమాతోనే సింగీతం దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకొని .. భారతదేశం గర్వించదగ్గ అద్భుతమైన సినిమాలు తీశారు.