నందమూరి బాలకృష్ణ 106 వ చిత్రం మీదే ఉంది ఇప్పుడు అభిమాను లందరి దృష్టి. బోయపాటి శ్రీను తో బాలయ్యబాబు మూడోసారి కొలాబరేట్ అవతూండడంతో.. అప్పుడే అందరి కళ్ళల్లోనూ హ్యాట్రిక్ ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఎప్పుడో లాంచ్ అయిన ఈ మూవీ.. ఇప్పటివరకూ సెట్స్ మీదకు వెళ్ళకపోవడం నందమూరి అభిమానుల్ని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ‘వినయ విధేయ రామ’ చిత్రంతో బోయపాటి డిజాస్టర్ ఫలితం అందుకున్న నేపథ్యంలో బాలయ్య.. అన్ని విషయాల్లోనూ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్ర్కిప్ట్ ను ఒకటికి పదిసార్లు సరిచూసి.. అవసరం ఉన్న మేరకు మార్పు లు చేర్పులు చేయిస్తూ దానికి ఫైనల్ రూపం తీసుకొచ్చారట.
ఎట్టకేలకు బౌండ్ స్ర్కిప్ట్ ను లాక్ చేసి.. మార్చ్ 2న సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారట. ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్ లోనే పూర్తి చేసి తదుపరి షెడ్యూల్స్ ను వివిధ లొకేషన్స్ లో చేయనున్నారట. వాటిలో అతి ముఖ్యమైనది గా వారణాసి షెడ్యూల్ ఉండబోతోందని టాక్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య అఘోరా గా కనిపించేది ఆ షెడ్యూల్ లోనే అవడంతో .. ఆయన గెటప్ మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంజలి, సోనాలీ చౌహాన్ కథానాయికలు గా నటిస్తోన్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాలయ్య, బోయపాటికి హ్యాట్రిక్ కాంబో అవుతుందేమో చూడాలి.