ప్రస్తుతం రానా నటిస్తోన్న హాథీమేరే సాథీ (తెలుగులో అరణ్య), ‘విరాట పర్వం’ చిత్రాలు రెండూ కూడా పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కానున్నాయి. ఇప్పుడు అదే కేటగిరిలో మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు రానా. అది కూడా తేజ దర్శకత్వంలో. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అందుకే  రెండో సారి రానా తో చేయనున్న సినిమా కోసం మళ్ళీ పొలిటికల్ స్టోరీనే రాసుకున్నాడు. సినిమాకి ‘రాక్షసరాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను కూడా ఖాయం చేశాడు. ఇందులో రానా నెగెటివ్ షెడ్స్ కలిగిన పాత్ర పోషించడం విశేషం.

అయితే ఈ సినిమా కోసం తేజా .. రానా సరసన ముగ్గురు ముద్దుగుమ్మల్ని ఎంపికచేయబోతున్నాడని టాక్. తన  పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్న తేజా  ఇందులోని హీరోయిన్స్ ను కూడా అప్పుడే ప్రకటించనున్నాడట. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న రాక్షసరాజ్యంలో రావణాసురుడు చిత్రం రానాకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!