కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరారు. ఆ  ఛాలెంజ్ లను స్వీకరించి చక చకా చేస్తూ మరొకరికి ఛాలెంజ్ లు విసురుతున్నారు.  ఒకవైపు హీరోయిన్లు పేపర్, పిల్లో ఛాలెంజ్ అంటూ చేస్తుంటే, హీరోలు మాత్రం ఇంట్లో పనులు చేస్తూ బి ది రియల్ మ్యాన్ అంటూ ఛాలెంజ్ లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన టాస్క్ ను ఇప్పటికే చిరంజీవి పూర్తి చేశారు. 

తాజాగా వెంకటేష్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.  దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  గార్డెన్ లో మొక్కలు గడ్డిని కట్ చేస్తూ, మొక్కలు నీళ్లు పెడుతూ, వంటగదిలో వంట చేస్తూ ఫుల్ బిజీగా గడిపాడు వెంకటేష్ టాస్క్ పూర్తయ్యాక తాపీగా కూర్చొని బుక్ చదువుకున్నాడు.  అయితే, ఈ టాస్క్ పూర్తి చేసిన తరువాత వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు, ఎఫ్ 2లో కలిసి నటించిన వరుణ్ తేజ్ కు, ఎఫ్ దర్శకుడు అనిల్ రావిపూడికి ఛాలెంజ్ విసిరాడు.  మరి మరి మహేష్ బాబు ఈ టాస్క్ ను ఎంత ఇన్నోవేటివ్ గా పూర్తి చేస్తాడో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!