Shopping Cart 0 items - $0.00 0

మళ్ళీ బుల్లితెరపైకి జగ్గూభాయ్

నైంటీస్ లో టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా చెలరేగిన జగపతి బాబు.. ఆ తర్వాత గ్రాడ్యుయల్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ, విలన్ గానూ టర్న్అయిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం నటిస్తూ..  బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు జగ్గూభాయ్ . సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత జోరుగా దూసుకుపోతోన్న ఆయన .. త్వరలోనే బుల్లితెరపై కూడా బిజీ కానున్నట్టు సమాచారం.

గతంలో ఒక టీవీ షో కు హోస్ట్ గా వ్యవహరించిన జగపతి బాబు .. త్వరలో  ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ డిజైన్ చేసిన ఒక సరికొత్త టాక్ షో కోసం మళ్లీ హోస్ట్ గా మారనున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన టాక్ షోస్ కు దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందట. మరో పక్క వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ.. ఇటు  బుల్లితెర మీద  తనదైన ముద్ర వేయడానికి సిద్దపడుతోన్న జేబీ సరికొత్త జెర్నీ ఎలా ఉండనుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!