టాలీవుడ్ న్యూ సెన్సేషన్ విజయ్ దేవరకొండ .. తన స్టైల్ తోనూ, యాటి ట్యూడ్ తోనూ చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఏ వేదిక మీద మాట్లాడినా, పబ్లిక్ లోకి వెళ్లినా.. అభిమానులు ఖుషీ అయ్యే విధంగా అతడు తనదైన రూట్లో ట్రావెల్ అవుతున్నాడు. అందుకేనేమో .. లాస్టియర్ లాగానే అతడు ఈ ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో నెం1 స్థానాన్ని అధిష్టించాడు.
‘హైద్రాబాద్ టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ‘మెస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ గా విజయ్ దేవరకొండ ఎంపికవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సరిగ్గా లాస్టియర్ కూడా విజయ్ దేవరకొండ మొదటి స్థానం లో నిలిచాడు. అసలు మీరు మళ్లీ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా ఎంపికవడం వెనుక గల సీక్రెట్ ఏంటని విజయ్ ను ప్రశ్నించగా.. సీక్రెట్ లాంటిదేమీ లేదు. అసలు నేను అలా ఎంపికవడం చాలా ఆసక్తిగా ఉంది. అయితే నాపై జనం ఎంత అభిమానం చూపిస్తున్నారన్న విషయం దీన్ని బట్టే అర్ధమైందని విజయ్ స్పందించాడు. అలాగే మీరు పబ్లిక్ ఫంక్షన్స్ కు లుంగీలు, షాట్స్ మీద వస్తారు. అలా రావాలని మీకు ఎందుకనిపిస్తుందన్న మరో ప్రశ్నకు.. వాటిని ధరించడం వల్ల తనకు చాలా కంఫర్ట్ అని విజయ్ చాలా కేజువల్ గా ఆన్సరిచ్చాడు.