కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే ఇప్పుడు కరోనాపై సంగీత దర్శకుడు కోటి మరోసారి  వినూత్నంగా తన సందేశాన్ని తెలిపాడు. మొన్నామధ్య చిరంజీివి , సాయధరమ్ తేజ, వరుణ్ తేజ లాంటివారి పై ఒక పాటను చిత్రీకరించి విడుదల చేసిన కోటి.. ఇప్పుడు మాత్రం ఏ స్టార్స్  లేకుండా డాక్యుమెంట్ స్టైల్లో పాటను విడుదల చేయడం విశేషం. 

మనిషిలో స్వార్ధం.. మనసులో మలినం చేరుతున్న కొద్ది.. తన స్వార్ధం కోసం ప్రకృతిని వాడుతున్న కొద్దీ.. నిలబడ్డ అడుగు నుంచి అంతరిక్షం వరకూ అంతా కలుషితమే. మనిషి తన సాటివారిపైనా అక్రమాలకు దిగేటంత నీచానికి దిగజారిపోయాడు. బ్రతుకొక రణమయ్యింది. అంటూ.. దీనికి ఏమిటి నీ సమాధానం అంటూ.. ఆవేశపూరితమైన .. సందేశాత్మకమైన ఒక పాటను డాక్యుమెంటరీ స్టైల్లో  చిత్రీకరించి  ట్విట్టర్ లో విడుదల చేశారు.  సేవ్ ది వరల్డ్ పేరుతో యూ ట్యూబ్ లోకొచ్చిన ఈ సాట జనాన్ని ఆలోచింపచేస్తోంది. 

 

Leave a comment

error: Content is protected !!