Shopping Cart 0 items - $0.00 0

బలరామకృష్ణులు

యాంగ్గ్రీమేన్ రాజశేఖర్ , నట భూషణ శోభన్ బాబు నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘బలరామకృష్ణులు’.రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1992 , నవంబర్ 7న విడుదలై.. ఘన విజయం సాధించింది. ఇద్దరు సవతి అన్నదమ్ముల మధ్య జరిగే ఇగో క్లాషెస్ .. తదనంతర పరిణామాలు ఈ సినిమా కథాంశం. శోభన్ బాబు, రాజశేఖర్ ,జగపతిబాబు, రాఘవి,  రమ్యకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, తణికెళ్ళ భరణి, రామిరెడ్డి తదితరులు నటించిన ఈ మూవీ 1991 లో తమిళంలో వచ్చిన ‘చేరన్ పాండ్యన్’ చిత్రానికి రీమేక్. విజయ్ కుమార్, శరత్ కుమార్ నటించిన  ఈ మూవీకి కే.యస్. రవికుమార్ దర్శకుడు. ఈ సినిమా తమిళంలో బిగ్గెస్ట్ హిట్టు అవడంతో ..  శ్రీ స్రవంతి మూవీస్, వెన్నెల ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుంకర మధుమురళి నిర్మించారు. రాజశేఖర్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా బలరామకృష్ణులు చిత్రం నిలిచిపోయింది. కోటి సంగీతం అందించిన ఆ మూవీలోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని ఎంతగానో అలరిస్తుంటాయి.

Leave a comment

error: Content is protected !!