ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడమే  ధ్యేయంగా పెట్టుకొని .. టాప్ రేటింగ్స్ తెచ్చుకొన్న సీరియల్ ‘అమృతం’. గుణ్ణం గంగరాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సీరియల్ ను  హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, నారిపెద్ది , వాసు ఇంటూరి .. కర్త, కర్మ, క్రియలై నడిపించారు. అమృత విలాస్ అనే రెస్టారెంట్ తో .. లాభాలు గడించాలనుకున్న ఇద్దరు మిత్రులకు..  ఇంటి ఓనరైన అప్పాజీ అడుగడున అడ్డు తగులుతుంటాడు. అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనుకున్న ఆ మిత్రులు చివరికి ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటారు అనే థీమ్ తో ప్రతీ ఎపిసోడ్ తోనూ నవ్వులు పూయించారు.

అలాంటి ఈ సీరియల్ ను ఇప్పటి ట్రెండ్ కు  తగ్గట్టుగా  మలిచి.. ‘అమృతం 2’ గా వెబ్ సిరీస్ గా  నిర్మిస్తున్నారు గుణ్ణం గంగరాజు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద ఉగాది సందర్భంగా స్ట్రీమింగ్ కానుంది ‘అమృతం’ ద్వితీయం . అందుకే మేకర్స్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. అందులో భాగంగా ‘అమృతం ద్వితీయం’ ప్రోమో విడుదల చేశారు. అమృతం నటీనటులందరూ .. అమృతం మళ్లీ మొదలు కానుందా ? అనే కొచిన్ మార్క్ తో ఆశ్చర్యపడ్డం ఈ ప్రోమోలో కనిపిస్తుంది. గుండు హనుమంతరావు ప్లేస్ లోకి వచ్చిన ఎల్బీ శ్రీరామ్.. అమృతం సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మొదలుపెడదాం.. అంటూ ప్రోమో ఎండింగ్ లో చెప్పడం ఆకట్టుకుంటుంది. మరి అమృతం ద్వితీయం .. అద్వితీయం అనిపించుకుంటుందేమో చూడాలి.

ప్రోమో వీడియో చూడాలనుకుంటే కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=Wtf1m_BDjOw&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!