తమిళ సినీ ప్రేక్షకులతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన ప్రముఖ నటుడు విసు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విసు చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో డాక్టర్లు ఆయన్ను కాపాడలేక పోయారట. విసు మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. 1945 జులై 1న తమిళనాడులోని ఒక సాదారణ కుటుంబంలో ఆయన జన్మించారు.

సినిమాలపై ఆసక్తితో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. 1981లో నటుడిగా విసు తన ప్రస్థానంను ప్రారంభించారు. కుటుంబం ఒరు కదంబం అనే చిత్రంలో నటుడిగా మొదటి సారి నటించి మెప్పించారు.  విసు నటించిన ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయితే .. వాటిలో ఆయన పాత్రను పోషించింది గొల్లపూడి మారుతీరావే. గొల్లపూడికి బాగా పేరు తెచ్చిపెట్టిన  ‘సంసారం ఒక చదరంగం, మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు’ లాంటి సినిమాలన్నీ తమిళంలో విసు నటించిన చిత్రాలే కావడం విశేషం.

Leave a comment

error: Content is protected !!