కరోనా మహమ్మారి దెబ్బ అన్నిరంగాలకు చాలా ఎక్కువగా తగిలింది . లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు.  ఇప్పటికే టాలీవుడ్ లో సిసిసి పేరుతో చిరంజీవి నాయకత్వంలో సహాయం అందిస్తున్నారు. కాగా.. బాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు విరాళాల్ని ప్రకటిస్తున్నారు.  ఇప్పటికే కరోనాపై ఫైట్ కోసం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్’ విరాళానికి ఏకంగా అక్షయ్ కుమార్ భారీ  విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన అక్షయ్ .. ఆ తర్వాత పారిశుధ్య కార్మికుల కోసం ముంబై మున్సిపాలిటీకి విరాళం అందించాడు. ఇప్పుడు  మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు అక్షయ్ కుమార్.

తాజాగా ఆయన ముంబై పోలీస్‌ ఫౌండేషన్‌కి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇదే విషయాన్ని ముంబైపోలీస్‌ కమీషనర్‌ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా అక్షయ్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. ముంబై పోలీసు ఫోర్స్‌ కరోనా కట్టడిలో చాలా బాగా కృషి చేస్తుంది. ఇప్పటికే అక్షయ్‌ కరోనా మహమ్మారిని పారద్రోలటానికి వ్యక్తిగత రక్షణ సామాగ్రితో (పిపిఇ-కిట్స్‌) పాటు, కరోనా పరీక్ష నిర్ధారణను వేగవంతం చేయడం కోసం బీఎమ్‌సీకి (ముంబై మునిసిపల్‌ కార్పోరేషన్‌) 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొదట్లోనే కరోనాపై పోరాటానికి పీఎమ్‌-కేర్స ఫండ్‌కి సాయం చేశాడు. మొత్తం మీద  అక్షయ్‌ కుమార్‌ దేశంలో ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించే నటుడిగా పేరుంది.

Leave a comment

error: Content is protected !!