కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే ఇప్పుడు కరోనాపై సంగీత దర్శకుడు కోటి మూడోసారి  మరింత వినూత్నంగా తన సందేశాన్ని తెలిపాడు. మొన్నామధ్య చిరంజీవి , సాయధరమ్ తేజ, వరుణ్ తేజ లాంటివారి పై ఒక పాటను చిత్రీకరించి విడుదల చేసిన కోటి..  నిన్న కరోనా మహమ్మారిపై మరో పాట విడుదల చేశారు. అయితే ఈ సారి మాత్రం పోలీసుల సేవల్ని కొనియాడుతూ.. పోలీసులు వారియర్స్ మన ప్రాణ దాతలు అంటూ  ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు.

జయహో పోలీస్ .. యూవార్ ద వారియర్స్ . జయహో పోలీస్ యువార్ ద సేవియర్స్ . ఓ పోలీస్ .. మీ వల్ల మేము పదిలం… ఓ పోలీస్ మా కొరకు మీది యుద్ధం. ఈ ఆపదలోన రక్షణ కవచం మీరయ్యారంటా.. అందరి క్షేమం నిత్యం కోరుతు నలిగే సేవకుడా.. ఓ పోలీస్ .. మీ త్యాగమెట్ల కొలవం.. ఓ పోలీస్ .. మీ మేలు మేము మరువం… అంటూ సాగే.. ఈ పాట పోలీసులు డ్యూటీ చేస్తూ..జనానికి కరోనా మీద అవగాహన కలిగిస్తూ.. కాపాలాకాసే  ఫుటేజ్ మీద చిత్రీకరించి మరోసారి సత్తా చాటుకున్నారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీనివాస  మౌళి రాసిన ఆ పాటను కోటి కంపోజ్ చేసి..స్వయంగా పాడడం విశేషం.  

కోటి పాటను వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=5&v=rlpfs2p0akM&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!