‘మజిలీ, వెంకీమామ’ చిత్రాలతో వరుస విజయాలు ఖాతాలో వేసుకొన్న నాగచైతన్య .. మరింత ఉత్సాహంగా తదుపరి ప్రాజెక్ట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తోన్న చైతూ.. ఆ వెంటనే ‘బంగార్రాజు’ చేయడానికి రెడీ గా ఉన్నాడు. ‘మనం’ తర్వాత నాన్న నాగార్జున తో మరోసారి స్ర్కీన్ షేర్ చేసుకోడానికి ముచ్చటపడుతున్నాడు. ఇక దీని తర్వాత ఈ శైలజా రెడ్డిగారి అల్లుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సైన్ చేశాడని తెలుస్తోంది.  దాని టైటిల్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.  

14రీల్స్ బ్యానర్ లో  పరశురామ్ దర్శకత్వంలో చైతూ ఒక సినిమా చేయబోతున్నాడు. స్ర్కిప్ట్ వర్క్  ను దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు చాలా ఆశ్చర్యకరమైన టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నాడట. ‘సోలో, సారొచ్చారు, గీతగోవిందం’ లాంటి టైటిల్స్ ను కథకు అనుగుణంగా సెట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు చైతూ కోసం ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నాడట. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఈ టైటిల్ కు అమోద ముద్ర వేయించుకొని.. వారు యస్ అంటే…. రంగంలోకి దూకేందుకు రెడీ గా ఉన్నాడట పరశురామ్. ఆల్రెడీ ‘మహానటి’ సినిమాలో తాత నాగేశ్వరరావు పాత్రను ఇష్టపడి మరీ పోషించిన చైతూ.. ఇప్పుడు తాత పేరునే తన సినిమాకు టైటిల్ గా పెట్టుకోనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి నాగచైతన్య ‘నాగేశ్వరరావు’ గా ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!