Shopping Cart 0 items - $0.00 0

దళితుడిగా అక్కినేని వారసుడు?

అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో చైతూ   ఒక దళిత యువకుడిగా నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవితో మొదటిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో ఆమె అగ్రకులానికి చెందిన అమ్మాయిగా నటించనుందట. లో అండ్ హై కేస్ట్స్ కు చెందిన ప్రేమికులు తమ ప్రేమను ఎలా గెలిపించుకుంటారనే కథతో ఈ సినిమాను శేఖర్ కమ్ముల హైలీ ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నాడట. 

‘ఫిదా’తో ఒక క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించి సత్తా చాటుకున్న శేఖర్ కమ్ముల..  ‘లవ్ స్టోరీ’ మూవీని దానికి మించిన స్థాయిలో మలుస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో  నాగచైతన్య తొలిసారిగా తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట. దాని కోసం ప్రత్యేకశిక్షణ తీసుకుంటున్నాడని వినికిడి.  ఏసియన్ సినిమాస్ బ్యానర్ పై నారాయణ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఫిదా చేస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!